
మణిరత్నం తీసిన క్లాసిక్ సినిమా "రోజా". ఆ సినిమాతో ఒక్క సారిగాపాపులర్ అయిన నటులు అరవింద్ స్వామి, మధుబాల. ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ 28 సంవత్సరాల తర్వాత రిపీట్ కాబోతుంది. ఒకప్పటి గొప్ప నటి, 6 సార్లు తమిళనాడుకి ముఖ్యమంత్రి గా చేసిన జయలలిత గారి జీవితం ఆధారంగా విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ కలసివిబ్రి మీడియా మరియు కర్మ మీడియా అండ్ ఎన్టర్టైన్మెంట్బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "తలైవి". జయలలిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటిస్తుంది. మద్రాసిపట్టణం, దైవ తిరుమగల్ (తెలుగులో "నాన్న") వంటి ఫీల్ గుడ్ మూవిస్ కి దర్శకత్వం వహించిన "ఏఎల్ విజయ్" ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో "ఎం జీ ఆర్" పాత్రలో "అరవింద్ స్వామి", ఆయన భార్య "వి.ఎన్.జానకి" పాత్రలో "మధు బాల" నటిస్తున్నారు.
ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ "రోజా సినిమా చేసినప్పుడు రాష్ట్రప్రభుత్వం అవార్డు తీసుకునే సంధర్భంలో జయలలిత ను కలిశాను. ఆమె నా నటనను ప్రశంసించారు కానీ నేను జానకమ్మను ఎప్పుడూ కలవలేదు. ఆ పాత్ర కోసం దర్శకుడు ఏ ఎల్ విజయ్ చాలా పరిశోధన చేశారు. జానకమ్మ పాత వీడియోలు చూసి ఆమె భంగిమలు, హావభావాలను అనుకరించాలి. ఒక వ్యక్తి పాత్రను తెరపై పోషించాలంటే చాలా కష్ట పడాలి. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి" అన్నారు మధుబాల. అంతే కాక ఈ చిత్రంలో మళయాల నటి "భాగ్య శ్రీ" జయలలిత తల్లి పాత్రలో, నటుడు "ప్రకాష్ రాజ్" "ఎం. కరుణానిధి" పాత్రలో, ప్రముఖ బెంగాలీ నటుడు "జిష్షు సేన్ గుప్తా" "శోభన్ బాబు" పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్, ఛాయా గ్రహణం విశాల్ విట్టల్, కూర్పు ఆంథోని.