
ఎన్టీఆర్, రామ్‌చరణ్ లు కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాకి సంబందించిన పోస్టర్లు, రామ్ చరణ్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన మరో పోస్టర్ ను చిత్ర బృందం ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసి, ఈ పోస్టర్ చిత్ర బృందం తరపునుంచి దర్శకుడు రాజమౌళి గారికి పుట్టినరోజు కానుక అంటూ ట్వీట్ చేసారు . అశోక చక్రం ముందు ఇద్దరి వ్యక్తుల చేతులు కలిపి ఉన్న ఆ పోస్టర్ ఇప్పుడు అంతర్జాలంలో చెక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్ కు నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి స్వతంత్రం కోసం పోరాడుతారని చాలామంది కామెంట్స్ పెట్టారు. కాగా ఈ విషయమై చిత్ర బృందం నేటిజెన్ల ట్వీట్లకు రీట్వీట్ చేస్తూ, ‘‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలుసుకుంటారని, ఫొటోలో ఉండేది వారి చేతులే, కానీ ఇది దేశ భక్తి సినిమా కాదు, ఫిక్షనల్ చిత్రమే’ అని స్పష్టం చేసింది. ఎన్టీఆర్‌కి హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్ కి బాలివుడ్ నటి ఆలియా భట్ జంటగా కనిపించనున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 22న ఎన్టీఆర్‌కి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు.
🔥🤝 🌊 #RRR pic.twitter.com/4EfS3fwWCB
— RRR Movie (@RRRMovie) October 10, 2020