
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో, ఆ మాటకొస్తే అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఘనుడు. అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే రాజమౌళి ప్రస్తుతం ఇద్దరు టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి ఈ సినిమా ద్వారా వీళ్ళిద్దరిని కలిపి చూపిస్తుండడంతో ఇరువురి ఫ్యాన్స్ ఆనందాలకి అవధులు లేవనే చెప్పొచ్చు. అయితే ఈ క్రెడిట్ అంత రాజమౌళి గారిదే. ఆర్.ఆర్.ఆర్ షూట్ ఇటీవలే తిరిగి మొదలైంది. కాగా రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ చాలా వెరైటీగా ఆయనకు విషెస్ చెప్పారు. రాజమౌళిపై తమకున్న కంప్లైంట్స్ ను ఒక వీడియోలో తెలియజేసారు. అయితే ఈ కంప్లైంట్స్ చాలా క్రియేటివ్ గా ఉండడమే కాకుండా ఫన్నీగా కూడా ఉన్నాయి. రాజమౌళి వ్యక్తిత్వాన్ని, కష్టపడి పనిచేసే తత్వాన్ని ఆయన పై వాళ్ళకున్న గౌరవాన్ని ఈ వీడియో ద్వారా తెలిపారు.