
సాయి ధరమ్ తేజ్
నిజమైన "సుప్రీం హీరో" లక్షణాలని అలవర్చుకుంటున్నాడు అతనిది నిజంగా రియల్ హీరో మనస్తత్వం. ఇతరులకి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందే ఉంటాడు.
తన గత బర్త్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశాడు.
విజయవాడలోని "అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ"యొక్క నిర్వాహకులు తనను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారని, అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరారని తెలిపాడు.
అది చూసి "అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ"యొక్క బిల్డింగ్ నిర్మాణ బాధ్యతను తీసుకున్నానని తెలిపాడు.
ఇచ్చిన మాట ప్రకారం..
'అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ' వృద్ధాశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేశాడు.

అంతేకాకుండా మెగా అభిమానులు కూడా తన బర్త్ డే కి పెట్టే ఖర్చుని ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఇవ్విల్సిందిగా విజ్ఞప్తి చేశాడు.
సాయి ధరమ్ తేజ్ పిలుపుమేరకు మెగా అభిమానులు కూడా లక్ష రూపాయల సహాయం చేశారని తెలుస్తోంది.
ఈ వృద్ధాశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా ఒక సంవత్సరం పాటు ఆర్థికంగా అండగా ఉంటానని తెలిపాడు మన "సుప్రీం హీరో" సాయి ధరమ్ తేజ్.
హీరోగా తన పని తాను చేసుకుంటూ పోవడమే కాకుండా, సమాజం పట్ల సామాజిక బాధ్యత కలిగి ఉండటం అనేది నిజంగా అభినందనీయం.
హాట్స్ ఆఫ్ సాయి ధరమ్ తేజ్.