
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అంటూ పోస్ట్ చేసారు. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ అనే సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.తమన్ సంగీతంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే చక్కని ప్రేక్షకాదరణ పొందాయి. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే లాంటి హిట్ చిత్రాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. సినిమా విడుదలకు ముందే ఈ సినిమా పట్ల నెటీజన్స్ పాజిటివ్ గా వారి రెస్పాన్స్ తెలియజేయడం మంచి పరిణామం.
అతి త్వరలో మీ ముందుకు... 😊 pic.twitter.com/zAuRGmN39z
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 21, 2020