
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. సోనీ పిక్చర్స్, జీ. ఎం.బి, ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబరు 26-2008 ముంబాయిలో జరిగిన ఉగ్ర దాడుల్లో అమరుడై భారత ప్రభుత్వం ద్వారా ఆశోక చక్ర, గ్యాలంట్రీ పురస్కారాలు అందుకున్న ఎం.ఎస్.జి కమాండో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ పాత్ర కోసం అడివి శేష్ మేకోవర్ అవుతున్నట్టు సమాచారం.
కాగా తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటించనుందని చిత్ర వర్గం గురువారం వెల్లడించింది. చిత్ర వర్గం ఆమెను సంప్రదించగా ఆమె సానుకూలంగా స్పందించారని, వచ్చే నెల నుండి ఆమె షూటింగ్ లో పాల్గొంటారని వారు తెలియచేశారు.