
“ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” చిత్రం లో తన నటవిశ్వరూపం చూపించిన నటుడు సత్య దేవ్ ఇప్పుడు తిమ్మరుసుగా రూపాంతరం చెందబోతున్నాడు. తన ఆఖరి చిత్రం "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయి సత్యదేవ్ కి నటుడిగా మంచి గుర్తింపు ను తెచ్చిపెట్టింది.తన కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న సత్యదేవ్ ఇప్పుడు మరో సినిమా ను ప్రారంభించనున్నాడు. ఈస్ట్ కోర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై “మహేష్ కోనేరు తో పారు ఎస్ ఒరిగినల్స్ బ్యానర్ నిర్మాత సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తుండగా కిరాక్ పార్టీ చిత్ర దర్శకుడు శరణ కొప్పిశెట్టి దర్శకత్వం లో తిమ్మరుసు అనే చిత్రం రూపొందుతుంది. దానికి ట్యాగ్ లైన్ “అసైన్మెంట్ వాలి”ఈ చిత్ర ముహూర్తం ఆదివారం హైదరాబాద్ లో జరిగంది . నిర్మాతలు మాట్లాడుతూ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తున్న హీరో సత్యదేవ్ తనకంటూ ఒక ఇమేజ్ ను తయారు చేసుకున్నారు. అలాంటి హీరో తో సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. తిమ్మరుసు సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అసైన్మెంట్ వాలి అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. ఈ నెల 21 నుండి చిత్రీకరణ మొదలవుతుందని, లాంగ్ షెడ్యూల్లో సినిమా షూటింగ్ కొనసాగుంతుందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో టాక్సీ వాలా ఫేం ప్రియాంక ఝావల్కర్ సత్యదేవ్ కు జోడీగా నటిస్తుంది. బ్రహ్మాజీ అజయ్, ఝాన్సి, ప్రవీణ్, వైవా హర్ష ప్రధాన తారాగణం. సంగీతం శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ అప్పూ ప్రభాకర్ , ఆర్ట్ కిరణ్ కుమార్ మన్నే , ఆక్షన్ రియల్ సతీష్ లు ముఖ్య సాంకేతిక వర్గం.