
కెరీర్ మొదట్లోనే వరస హిట్స్ తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ప్రతి రోజు పండగే చిత్ర విజయంతో తన తదుపరి చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన సోలో బ్రతుకు సో బెటరు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.
ఆ చిత్రం తర్వాత ఆయన స్పీడ్ పెంచారు. ఈ చిత్రం తర్వాత ఆయన దేవా కట్టా గారి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ మొదలవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.