
సఖి, 13/b లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు ‘మాధవన్’. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతినాయకుడిగా కుడా ఈ మధ్య ప్రేక్షకులని ఆయన పలకరిస్తున్నారు. కాగా అనుష్క ప్రధాన పాత్రలో ఆయన నటించిన నిశ్శబ్ధం సినిమా విడుదలకు సిద్దమై అమెజాన్ ప్రైం లో విదుల కానుంది. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో ఈ విధంగా ముచ్చటించారు.
ఆయన నిశ్శబ్ధం సినిమా గురించి మాట్లాడుతూ ‘ నిశ్శబ్ధం ఒక థ్రిల్లర్ అనుష్క ఒక బధిర యువతిగా నేను ఛెలో ప్లేయర్ గా కనిపిస్తాము. వివిధ నేపధ్యాలున్న మేము ఎలా కలిశాము? మా మధ్య ఉన్న అనుబంధం ఏంటి? తర్వాత ఏం జరిగింది అనేది మిగితా కథ. ఈ చిత్రం కోసం నేను ఛెలో నేర్చుకున్నాను. నేను ఛెలో ప్లేయర్ అని ప్రేక్షకుల నమ్మే విధంగా నటించడం నాకు ఎదురైన అతి పెద్ద సవాల్’ అని ఆయన అన్నారు.
ఓ.టి.టి ల గురించి మాట్లాడుతూ ‘నిశ్శబ్ధం అమెజాన్ ప్రైం లో విడుదల అవుతోంది, నేను నటించిన తమిళ చిత్రం ‘మారా’ కూడా అందులోనే విడుదల అవుతుందని అనుకుంటున్నా. థియేటర్ లో సినిమా చూడాలి అనుకున్నప్పుడు పలానా సినిమా పలానా థియేటర్ లోనే విదిలవుతుంది లేదా పలానా తేది, పలానా షో లు మాత్రమె ఉంటాయి అనే కొన్ని విషయాలతో ఆ సినిమాను మనం చూడలేకపోవచ్చు అదే ఓ.టి.టి లలో అయితే మనం ఉన్న చోటునుంచే మనం చూడాలనుకున్న టైం లోనే చూడొచ్చు. కాని ఓ.టి.టి లలో సాముహిక వీక్షణ అనుభూతిని మనం కోల్పోతాం. కేవలం థియేటర్ లో మాత్రమె అవతలి వారి రియాక్షన్ ను మనం ఎంజాయ్ చేయగలుగుతాం. మన దెగ్గర సరిపడా థియేటర్లు లేవు ఏడాదికి సగటున 1200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి థియేటర్ లో రిలీజ్ చేయలేని సినిమాలు రిలీజ్ చేయడానికి ఓ.టి.టి చక్కని వేదిక’. అని చెప్పారు.