
తమిళనటుడు జయం రవి సెప్టెంబర్ 10న తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోరాదని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
సెప్టెంబర్ 10న భారీ ఎత్తున తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలన్న అభిమానుల నిర్ణయం పట్ల జయం రవి స్పందిస్తూ...
కరోనా వల్ల ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని అందుకే పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
వీలైతే సెప్టెంబర్ 10న తన అభిమానులు కరోనా బాధితులకు మాస్కులు, శానిటైజర్స్, రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలు లాంటివి పంపిణీ చేయాలని కోరారు.