
"సరి లేరు నీకెవ్వరు" సినిమాతో సెన్స్ఏషనల్ హిట్ ను దక్కించుకున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు
మరో ఆసక్తి కరమైన కాంబినేషన్ తో ముందుకు వస్తుంది.
అదే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు "అజయ్ భూపతి" దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న "మహాసముద్రం" సినిమా నిర్మాత
ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత
"అనిల్ సుంకర"నిన్న సాయంత్రం రేపు ఉదయం ఒక మహా అనౌన్స్మెంట్ ఉండబోతుందని చెప్పి అందరిలో ఒక ఆసక్తిని పెంచారు. చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం ఆ మహా అనౌన్స్ వచ్చింది.
వివరాల్లోకి వెళితే...
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరో "సిద్ధార్థ్" ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
"మహా సముద్రం" కథ, ఆ కథలో తన పాత్ర కూడా ఎంతో నచ్చడంతో చాలా రోజుల తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించేందుకు "సిద్ధార్థ్" అంగీకరించినట్టు తెలుస్తోంది.