శర్వానంద్ లైనప్ మాములుగా లేదుగా

యువ హీరో శర్వానంద్ వరస ప్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హ్యాట్రిక్ ప్లాపులను మూటగట్టుకున్న శర్వానంద్ ఇప్పుడు వరసగా సినిమాలను లైన్లో పెట్టారు. శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అనే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. రైతుల నేపథ్యంలో సాగే ఈ కథను కిషోర్ బి అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారు. అలాగే శర్వానంద్ నటిస్తున్న మరో చిత్రం కూడా సెట్స్ పైనే ఉంది. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో  తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరలో పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించనున్న మహా సముద్రం అనే యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనే సిద్ధార్థ్ మరో హీరోగా నటించనుండగా అదితి రావు హైదరి, అను ఇమాన్యుయల్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది. ఇక శర్వానంద్ హీరోగా మరో చిత్రం నిన్న ప్రారంభమైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళూ మీకు జోహార్లు అనే చిత్రంలో ఆయన నటించనున్నారు. రష్మిక మండన్న హీరోయిన్ గా నటించనుంది. ఈ నాలుగు సినిమాలతో వచ్చే ఏడాది చివరి దాకా శర్వానంద్ ఫుల్ బిజీ. వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని శర్వానంద్ ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.