
వరస సినిమాలు చేస్తున్న శర్వనంద్ కొత్తగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రష్మిక హీరోయిన్ గా ఒక సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా రోజున అంటే ఆదివారం మధ్యాహ్నం ఈ సినిమా ప్రారంభం అయింది. కావున విజయదశమి సందర్భంగా శర్వనంద్, రష్మిక మండన్న అలాగే కిషోర్ తిరుమల కలిసి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ రోజు ఉదయం వి.ఐ.పి దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకోగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. చిత్ర బృందం ప్రేక్షకాభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
My next film is titled #AadaallooMeekuJohaarlu to be directed by Kishore Tirumala and co starting @iamRashmika 😊
— Sharwanand (@ImSharwanand) October 25, 2020
Produced by @SLVCinemasOffl
More Details Soon 😁 pic.twitter.com/nerTTlh987
రామ్ తో తీసే ‘రెడ్’ సినిమా పూర్తి అవ్వడంతో కిషోర్ తిరుమల వెంటనే ఇంకో సినిమాని లైన్ లోకి తీసుకొచ్చారు.ఈ రోజే ఈ సినిమా టైటిల్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అని కూడా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. వరసగా పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్న రష్మీక మండన్న ఇప్పుడు ఈ సినిమాని ఒప్పుకోవడం వల్ల ఈ సినిమాకి క్రేజ్ మొదలైంది. అలాగే శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వాకి జంటగా ప్రియాంక అరుల్ మోహన్ సందడి చేయనున్నారు. ఇటీవల ‘శ్రీకారం’ షూటింగ్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది. మరోవైపు ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం లో నటిస్తున్నారు.