
బాలీవుడ్ నటుడు సోను సూద్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను ప్రారంభించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే మార్గంలో ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..
ఆయన ట్వీట్ లో “హిందుస్తాన్ బడేగ తభి , జబ్ పడ్ఎంగే సభి! అనే నినాదం ఇస్తూ ఉన్నత విద్య కోసం విద్యార్థులకు పూర్తి స్కాలర్షిప్లను ప్రారంభిస్తున్నాను. ఆర్థిక ఇబందులు ఎవరినీ తమ లక్ష్యాలను చేరుకోకుండా ఆపకూడదని నా నమ్మకం. scholarships@sonusood.me మెయిల్ కి ఎంట్రీలను పదిరోజుల లోపు పంపితే నేనె మిమ్మల్ని సంప్రదిస్తాను.” అన్నాడు.
దాని తర్వాత సోనూ హిందీలో ఇంకో ట్వీట్ చేశారు. అది ఇలా ఉంది..
" మన సామర్థ్యం మరియు మన కృషి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దీనికి మన ఆర్థిక పరిస్థితులతో లేదా మన నేపథ్యంతో సంబంధం లేదు. నా ప్రయత్నం ఈ దిశలో ఉంది.. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత చదువుల కోసం స్కాలర్షిప్. తద్వారా మీరు జీవితంలో ముందుకు సాగండి మరియు దేశ అభివృద్ధికి తోడ్పడండి. ”
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో వలసదారులు తమ సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి సోను సూద్ చాలా సహాయం చేసి నేషనల్ హీరో అయ్యాడు. అప్పటి నుండి ఏదో ఒక మంచి పని చేస్తూ ఇలా నిత్యం టాక్ ఆఫ్ ద నేషన్ అవుతున్నాడు.