దుర్గామాత ఉత్సవాల్లో సోనూసూద్ విగ్రహాం

కరోనా వల్ల బడుగు వర్గాలు, వలస కూలీలు, పేదవాళ్ళు రోడ్డున పడ్డారు. ఈ లాక్ డౌన్ లో ఇలాంటివి ఎన్నో వార్తలు. ఆ వార్తలకు ఒక వ్యక్తి చలించి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళను ఆదుకుని దేవుడు అయ్యాడు. ఆ దేవుడు ఎవరో  కాదు సోనూసూద్ అనే విషయం తెలిసిందే. ఆయన లాక్‌డౌన్‌లో ఎందరో వలస కార్మికులను, పేదలను ఆదుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకున్న ఎందరినో సొంతూళ్లకు చేర్చారు. ఉద్యోగం లేదు అన్నా అని అడిగిన ఎందరికో ఉద్యోగాలు ఇప్పించారు. వ్యవసాయం చేసేందుకు ఎద్దులు లేక కూతుళ్లనే కాడెద్దులుగా మార్చిన సంఘటన గురించి తెలుసుకుని సాయంత్రానికి వారి ఇంటికి కొత్త ట్రాక్టర్ ను పంపించారు. లాక్‌డౌన్ తరువాత కూడా ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో సోనూసూద్‌కు ప్రజల్లో ఆదరాభిమానాలు పెరిగిపోయాయి. తాజాగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మండపంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది.

అక్కడ ప్రఫుల్లా కనక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాల్లో సోనూ సూద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కార్మికులకు చేసిన సాయాన్ని తెలిపేలా కార్మికులు, బస్సుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం ఇదేనని సోనుసూద్ దీని గురించి ట్వీట్ చేశారు. సోనూసూద్ ఈ వషయం పై స్పందిస్తూ “నిజమైన సంతృప్తి ప్రేమలో ఉంది. అది ప్రజల నుండి నేను పొందుతున్నాను. ఖచ్చితంగా  ప్రఫుల్లా కనక్ వెల్ఫేర్ అసోషియేషన్ నిర్వహించే దుర్గమాత పూజకి ఖచ్చితంగా అటెండ్ అవుతాను అని తెలిపారు. ఈ లాక్ డౌన్ లో సోనూసూద్ చేసే మంచి పనులకు ప్రజలు సోనూసూద్ పేరును, ఫోటోస్ ను హోటళ్ళ కు, దుకాణాలకు పెట్టుకుని ఆయన్ను గౌరవిస్తున్నారు, అభిమానిస్తన్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.