
కరోనా టైం లో సినిమా షూటింగ్ మొదలు పెట్టడం మధ్యలో సినిమా యూనిట్ వాళ్లకి కరోనా రావడం సినిమా షూటింగ్ మళ్లీ పోస్ట్ ఫోన్ చేయడం ఇలా చాలా సినిమాలకి జరిగింది .కానీ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ ఇటీవలే తిరుపతిలో మళ్ళీ ప్రారంభమైంది. ఈ సినిమా 20 రోజులపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇలాంటి కరోన ఉధృతి ఉన్న సమయంలో కూడా తమ టెక్నిషన్స్ , నటులు, డైరెక్షన్ టీం అందరూ కష్టపడి షెడ్యూల్ ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు చెప్పింది 14రీల్స్ ప్లస్ చిత్ర నిర్మాణ సంస్థ. ఇందులో హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తో పాటు నరేశ్ సహా ఇతర తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు.
Team #Sreekaram finished their 20 day long schedule at Tirupathi with huge star cast.
— Vamsi Kaka (@vamsikaka) October 27, 2020
Producers @RaamAchanta & #GopiAchanta thanked all the artists & technicians for their dedication & hardwork during this pandemic time.@imsharwanand @priyankamohan @ur_bkishor @14reelsplus pic.twitter.com/p6Psb727t8
ఇలానే తమ తదుపరి షెడ్యూల్ కూడా పూర్తి చేయాలని సినిమా టీం అనుకుంటున్నారు. ఈ సినిమా వ్యవసాయం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో శర్వానంద్ రైతుగా కనిపిస్తారు. కిశోర్ బి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా గారు మాటలు అందించడం విశేషం. 2021 మొదటి నెలలలోనే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.