
యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. శర్వానంద్ నటించిన ‘జాను’ చిత్రం రిలీజ్ అయ్యి 10నెలలు కావొస్తోంది. సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేసే శర్వానంద్ కరోనా కారణంగా ఈ సంవత్సరం ఒక్క చిత్రంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన స్పీడ్ పెంచి మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో
ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకారం గురించి. రైతులు, వ్యవసాయం కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కరోనా రాకపోయి ఉంటే ఖచ్చితంగా సమ్మర్ లో విడుదల చేద్దామనుకున్నారు. అయితే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ ఆరు నెలలకు పైగా జరగకుండా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం శ్రీకారం షూట్‌ను ఈరోజు నుండి తిరిగి మొదలుపెట్టారు. ఇదే ఈ చిత్రానికి లాస్ట్ షెడ్యూల్ అని తెలుస్తోంది. అన్ని జాగ్రత్తలు పాటించి
షూటింగ్ జరుపుతున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొన్నారు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శర్వానంద్ నటిస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కూడా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.
Back to the shoot of #Sreekaram taking all necessary Covid-19 precautions 👍🏽 https://t.co/eeZwmQYwCR
— 14 Reels Plus (@14ReelsPlus) October 8, 2020