
హాస్య నటుడిగా సునీల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకునారు. హాస్యనటుడిగా మాత్రమె కాకుండా అందాలరాముడు, మర్యాదరామన్న, పూలరంగడు తదితర చిత్రాల్లో హీరోగా కూడా నటించిన ఆయన, రవితేజ కథానాయకుడిగా నటించిన ‘డిస్కోరాజా’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. మంచి కథ దొరికితే ప్రతినాయక పాత్రలో నటించే ఉద్దేశంలో ఆయన ఉన్నారు.
నూతన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పనేని అమృత ప్రొడక్షన్స్ మరియు లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కలర్ ఫోటో’ సుహాస్, చాందిని జంటగా నటించారు. మత్తువదలరా చిత్రానికి సంగీతం అందించిన కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. వెంకట్ ఆర్ శాఖాపురి ఈ చిత్రానికి చాయాగ్రాహకుడు. కాగా ఇందులో ప్రతినాయక ఛాయలున్న ఒక పాత్రలో సునీల్ నటించారు. షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రాన్ని ’ ఆహా’లో రిలీస్ చేయనున్నారు. ఆక్టోబర్ 23న ఈ చిత్రం విడుదలకానుంది.
మోహన్ బాబు గారి ఇన్స్పిరషన్ తో ప్రతినాయకుడిగా నటించాలనే ఉద్దేశంతో నటుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టనని కెరీర్ బిగినింగ్ లో హాస్యనటుడిగా బిజీ అవ్వడం వల్ల ప్రతినాయకుడిగా నటించడం కుదరలేదు. విభిన్నమైన పాత్రల ద్వారా నటుడిగా తనని తాను మెరుగుపరుచుకోవచ్చని, కథ బాగుంటే ప్రతినాయక పాత్రలో నటించేందుకు సిద్దంగా ఉన్నట్టు నటుడు సునీల్ వ్యక్తపరిచారు.