
చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కుటుంబమంతా కలిసి ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఆ ఫోటో గురించి వివరాల్లోకి వెళ్తే, హీరో సుధీర్‌బాబు భార్య, సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి అయిన ప్రియదర్శిని పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం అంతా ఒకే చోట కలిసి భోజనం చేశారు. ఈ వేడుకలో మహేష్ బాబు బావ, ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జై దేవ్ గారు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన నాలుగు ఫొటోలను హీరో సుధీర్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కుటుంబమంతా కలిసి దిగిన నాలుగు ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. హీరో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోలకి అందమైన కామెంట్స్ పెడుతూ వారి ఆనందాన్ని తెలియజేస్తున్నారు.