
సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న 'చిత్రం సర్కారు వారి పాట'. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలు అవ్వాల్సినప్పటికీ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.
కాగా తాజా పరిణామాలతో గవర్నమెంట్ నుంచి షూటింగ్లకు అనుమతి లబించడంతో అన్ని చిత్రాలతో పాటు ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. చిత్ర మొదటి షెడ్యూల్ ని యు ఎస్ లో ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే డైరెక్టర్ పరుశురాం, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ తో పాటు మరికొంత మంది సాంకేతిక నిపుణులు యు.ఎస్ చేరుకొని లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్టు చిత్ర బృందం తెలిపింది.
ఈ షెడ్యూల్ నవంబర్ మూడో వారం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు జరగనుంది. ఈ ఒక్క షెడ్యూల్ తో సినిమా 45 శాతం పూర్తవుతుంది. ముఖ్యపాత్రల మధ్య జరిగే కీలకమైన సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్తో పూర్తైపోతాయి. వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తిచేసేవిధంగా మహేష్ బాబు చిత్ర బృందానికి సూచించారు. ఈ చిత్రాన్ని రానున్న 2021 వేసవి కాలం నాటికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు.