
పవర్ స్టార్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు . ఇంతక ముందులా కాకుండా ఏడాదికో సినిమా రిలీజ్ చేసే ఆలోచలనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. లాక్ డౌన్ ముందే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోన కారణంగా ఆగిపోయి పునఃప్రారంభం అయ్యింది. ఇదివరకు రిలీజైన ఫస్ట్ లుక్స్ అండ్ మూవీ పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
వకీల్ సాబ్ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది. క్రిష్ తో సినిమా తర్వాత ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. క్రిష్ తో సినిమా తర్వాత ఆ సినిమా పట్టాలెక్కచ్చు. ఇదిలా ఉంటె ఈ రెండు సినిమాలు పట్టాలెక్కకముందే ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ఆయన పనిచేయనున్నారు.
ఈ విషయం ఆ సినిమాని నిర్మిస్తున్న రామ్ తాళ్ళూరి ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పవన్ తో బాబి దర్శకత్వంలో ఎప్పుడో సినిమా అనుకున్నామని కాని కొన్ని కారణాల వాళ్ళ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని చాల రోజుల తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం మళ్ళీ వచ్చిందని ఆయన వివరించారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ తో సినిమా మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కుడా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఆయన వెల్లడించారు.