
ప్రముఖ రాజకీయ నాయకులు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త అయినటువంటి సుబ్బిరామి రెడ్డిగారి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పూర్తి పేరు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి సెప్టెంబరు 17 న 1943 లో బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించారు. వీరు ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యులు. ఈయన 1996, 1998 సంవత్సరాలలో 11వ, 12వ లోక్‌సభలకు విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. 2002 సంవత్సరం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.
సుబ్బరామిరెడ్డి హైదరాబాదు లోని నిజాం కళాశాల నుండి బి.కామ్ పట్టాపొందారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైనది.
సినీ నిర్మాతగా ఈయన నిర్మించిన సినిమాలు జీవన పోరాటం, స్టేట్ రౌడి, గ్యాంగ్ మాస్టర్, సూర్య ఐ.పి.ఎస్.. సుబ్బిరామిరెడ్డి గారు హిందీ లో కూడా పలు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. దిల్వాలా, చాందినీ, లమ్హే, స్వామి వివేకానంద వాటిలో చెప్పుకోదగ్గవి. సుబ్బిరామిరెడ్డి గారికి కళలు మీద మక్కువ ఎక్కువ. కళాభిమాని అయిన ఆయన కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రతియేటా ఆయన పేరు మీద అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. మీడియా9టాలీవుడ్ మనసారా కళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుపుతుంది .