
కరోనా కారణంగా ఇప్పుడు ఓ.టీ.టీ. ఫ్లాట్ ఫార్మ్ యుగం నడుస్తుందనే చెప్పాలి. సినిమా మేకర్స్ కూడా చాలా మంది ఇటు వైపే చూస్తున్నారు. వెబ్ సిరీస్ లు నిర్మించే పనుల్లో చాలామంది నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ.టీ.టీలు కూడా సొంతంగా వెబ్ మూవీస్ ను, వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. సినిమాలతో పోల్చితే డిజిటల్ కంటెంట్ ను అనుకున్న విధంగా చెప్పడమే కాకుండా సెన్సార్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవని తమ క్రియేటివిటీని అనుకున్నది అనుకున్నట్లుగా ప్రేక్షకులకు చేరవేయొచ్చనే భావనతో చాలా మంది డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే డిస్నీ , హాట్ స్టార్ లు కలిసి తమన్నా ప్రధాన పాత్రలో ‘నవంబర్ స్టోరీ’ అనే ఒక వెబ్ సిరీస్ ని రూపొందించింది. రామ్ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఈ తమిళ్ వెబ్ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తొంది.
Super excited to announce my new Tamil web series ‘November Story’, streaming soon exclusively on @Disneyplushsvip! #TamilNaattinPuthiyaThirai pic.twitter.com/mwh68vzWNm
— Tamannaah Bhatia (@tamannaahspeaks) October 23, 2020
తాజాగా తమన్నా తన వెబ్ సిరీస్ టీజర్ ని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ టీజర్ ని చూస్తుంటే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని అర్థమవుతోంది. గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురవ్వడం, ఈ హత్యకు దేశంలో ప్రసిద్ధ క్రైమ్ నవలా రచయిత అయిన తమన్నా తండ్రికి ఏదైనా సంబంధం ఉందా, లేదా అనే అనుమానాలు రేకెత్తించేలా చూపించారు. ఆ హత్యకు తమన్నా తండ్రికి సంబంధం ఏమిటి? ఆ హత్య తమన్నా తండ్రే చేశాడా? అనే అనుమానాలు కలిగిస్తోంది. ఈ సిరీస్ లో తమన్నా తండ్రి పాత్రలో జిఎమ్.కుమార్ నటించారు. చివరికి ఈ మర్డర్ మిస్టరీ కథ ఏమై ఉంటుందనే ఆసక్తిని కలిగించేలా ఉంది. ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో కూడా అనువాదం చేయనున్నారు. ‘నవంబర్ స్టోరీ’ సిరీస్ త్వరలోనే డిస్నీ, హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.