
లాక్ డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్ళకే పరిమితమైపోయారు తాప్సి కూడా తన కుటుంబంతో కలిసి ఆరు నెలలకు పైగా ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. అయితే ఇటీవలే గవర్నమెంట్ నిబంధనలను సడలించడంతో తాప్సి తన కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ హాలిడే ట్రిప్ కు వెళ్ళారు. అక్కడ వారం రోజుల నుండి ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. బికినీలో పూల్ సైడ్ రిలాక్స్ అవుతూ తాప్సి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటోను తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసి, తను చేయబోతున్న తదుపరి చిత్రం ‘రష్మీ రాకెట్’ కోసం డైట్ కంట్రోల్ చేసుకంటూ ఆ పాత్రకు తగ్గట్టుగా రెడీ అవుతున్నట్టు ఆవిడ రాశారు. కరోనా కారణంగా ఆరు నెలలు ఇంట్లోనే ఉన్న తాప్సీ హాలిడేను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో ‘రష్మీ రాకెట్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందుకోసం తన డైట్ ను కంట్రోల్ లో ఉంచుకుంటూ ఫిజిక్ ను కాపాడుకుంటోంది. ఒక రన్నర్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమిది. అలాగే ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో కూడా తాప్సి నటించనున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.