
నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సారథి’. పంచభూత క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి జాకట రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమి సందర్భంగా సారథి ఫస్ట్ లుక్ మోషన్పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా జాకట రమేష్ మాట్లాడుతూ ''ఇటీవల అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బ్యానర్ లోగోకి, ‘సారథి’ టైటిల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా నందమూరి తారకరత్న ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దసరాకి ఎంతో కాంపిటేషన్ ఉన్నప్పటికీ ‘సారథి’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభిస్తోంది. కరోనా సమయంలో కూడా నందమూరి తారకరత్న గారు ఎంతో సాహసంతో షెడ్యూల్ ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకి మా చిత్ర బృందం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని ‘సారథి’ సినిమాతో మరోసారి నిరూపితమైంది. స్నేహితులు, సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.సిద్దేశ్వర రావు, కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకారం, రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ, జబీర్ వెంకట్, ఫరీద్, దేవా, జై, మునీస, మధు, జమాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
కెమెరా: మనోహర్ కొల్లి,సిద్ధార్థ్ వాటికన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.