
సీనియర్ నటి ఖుష్బూ అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆమె బిజెపి తీర్ధాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఖుష్భూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఈ విషయాన్ని ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నటన, డైలాగ్ డెలివరీ తనకు చాలా ఇష్టమని, మనకున్న పరిపూర్ణ నటుల్లో ఎన్టీఆర్ ఒకరని ఆమె పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే.
A very very happy me to see @tarak9999
— KhushbuSundar ❤️ (@khushsundar) October 22, 2020
in his new avatar. Why is he my fav is for everyone to see. Wow Tarak! ❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍Superlatively terrific!! 😍😍😍😍😍 @ssrajamouli can't wait to watch yet another masterpiece from you. https://t.co/5LMdkz3LwC #RRRMovie
కొమరం భీమ్ పాత్ర పరిచయ వీడియో అది. దీనికి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ వీడియోకు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బాడీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఖుష్బూ ఇప్పుడు ఈ వీడియోపై స్పందించారు. "తారక్ ను ఇలా కొత్త రోల్ లో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. తారక్ నాకు ఎందుకు ఫేవరెట్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. వావ్ తారక్, టెరిఫిక్, రాజమౌళి గారు మీ నుండి మరో మాస్టర్ పీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని ట్వీట్ చేసారు.