సినిమాలు లేని పండుగ

దసరా, దీపావళీ, సంక్రాంతి లాంటి పెద్ద పండగలు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటివి. హాలిడేస్ లో జనాలకు సినిమాను మించి ఎంటర్ టైన్మెంట్ ఏదీ ఉండదు. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ తో కూడిన సినిమాల నుండీ చిన్న సినిమాల వరకూ పండగ సీజన్ లలో తమ సినిమాలను రీలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తుంటాయి. కానీ ఈ సారి పరిస్థితి తారు మారు అయింది. కోవిడ్ వలన అన్ని రంగాలు కుదేలయ్యాయి, సినిమా రంగమేమి దానికి అతీతం కాలేదు. థియేటర్లు తెరుచుకుని సుమారుగా తొమ్మిది నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా వేరు వేరు కారణాల వల్ల తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు ఇంకా పూర్థి స్థాయిలో తెరుచు కోలేదు. ఉన్నంతలో ప్రేక్షకులకు ఊరట ఓ.టి.టిలు. కోవిడ్ కు ముందు పూర్తయినవో, లేదో పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నవో కొన్ని సినిమాలు మెల్లగా ఓ.టి.టిల్లో రిలీజ్ అయ్యాయి. వాటిలో నాని, సుధీర్ బాబు నటించిన ‘v’, అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ కొద్దిగా పెద్ద సినిమాలు, అలాగే ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘అమరం అఖిలం ప్రేమ’ వంటి మీడియం రేంజ్ చిత్రాలు కూడా ఆన్లైన్ లో రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఓ.టి.టి ల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు అంతో కొంతో కాలాక్షేపాన్ని అందిస్తున్నాయి. కానీ ఎంత ఆన్లైన్లో రిలీజ్ అయినా అవి చేరేది కొంత మందికి మాత్రమే. థియేటర్ల లో రిలీజ్ అయిన సినిమాల రీచ్ వేరే ఉంటుంది.

మామూలుగా పండగ సీజన్ లలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల మార్కెట్ వందల కోట్లల్లో ఉంటుంది. 2019 దసరా కి సైరా నరసింహా రెడ్డి, 2018 దసరా కి అరవింద సమేత వీరరాఘవ చిత్రాలు రిలీజ్ అయ్యి కోట్లు కొల్లగొట్టాయి. కానీ ఈ దసరాకి ఆ పరిస్థితి లేదు. థియేటర్లల్లో సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు లేకపోయినా దసరా సందర్భంగా ఓ.టి.టిలో రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి అప్పుడెప్పుడో బాలకృష్ణ  నటించి, దర్శకత్వం వహించిన ‘నర్తనశాల’ సినిమా సౌందర్య అకాల మరణంతో ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాలోని 17 నిమిషాల సన్నివేషాలను శ్రేయాస్ ఓ.టి.టిలో రిలీజ్ చేశారు. అలాగే హాస్య నటుడు సుహాస్ హీరోగా, చాందినీ చౌదరీ హీరోయిన్ గా సునీల్ ముఖ్య పాత్రలో నటించిన కలర్ ఫోటో అనే సినిమాను ఆహా ఓ.టి.టి లో రిలీజ్ చేశారు. లాక్ డౌన్ తర్వాత మెల్ల మెల్లగా షూటింగ్స్ మొదలయ్యాయి. చిన్నా, పెద్ద సినిమాలు శర వేగంగ షూటింగ్ పూర్తి చేసుకుని రెడీ అవుతున్నాయి. రామ్ ‘రెడ్’, వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’, నితిన్ ‘రంగ్ దే’ చిత్రాలు షూటింగ్స్ పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాయి. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, ప్రభాస్, పూజా హెగ్డే ‘రాధే శ్యామ్’, రవితేజ ‘క్రాక్’, నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరి’, నాగార్జున ‘వైల్డ్ డాగ్’, నాని ‘టక్ జగదీష్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాలు షూటింగ్స్ ని పున:ప్రారంభించి శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే అగ్ర హీరోలు, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, చిరంజీవి ‘ఆచార్య’ రేపో మాపో తిరిగి సెట్ మీదికి వెళ్ళబోతున్నాయి. థియేటరులు పూర్తి స్థాయిలో ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారో రారో అనే అనుమానం ఇండస్ట్రీలో ఉంది. వచ్చే దీపావళీకి కాకపోయిన సంక్రాంతికి థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యి ప్రేక్షకులతో కలకల లాడుతాయని సినిమా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దీపావళికి ఏ సినిమాలూ రిలీజ్ అవుతున్నట్లు అధికార ప్రకటన ఇవ్వలేదు. కానీ రానా నటించిన ‘అరణ్య’ సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు. సంక్రాంతికైనా ఇండస్ట్రీలు వర్గాలు అనుకుంటునట్లు జరగాలంటే థియేటర్లు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో తెరుచుకోవాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.