నేడు“హాస్య కళా ప్రపూర్ణ” అల్లు రామలింగయ్య గారి జయంతి

‘తెలుగు తెర‌పై హాస్యపు జ‌ల్లు అల్లు’. ఆయ‌న మ‌న‌ మ‌ధ్య లేకున్నా, తెరపై ఆయన పండించిన హాస్యం, ఆయన హావభావాలు, మ‌రువ‌లేని జ్ఙాప‌కాలు. ఆయ‌న న‌టించే ప్రతీపాత్రని తనదైన రీతిలో న‌టించి న‌వ్వించిన ఘ‌నాపాటి పద్మశ్రీ ‘శ్రీ అల్లు రామ‌లింగ‌య్య’ గారు. ఆయన హాస్యానికి పెద్ద పీట వేసినా, కేవలం హాస్యపాత్రాలే కాకుండా పోలీస్ గా, భాద్యతగల తండ్రిగా, కామెడి విలన్ గా, రకరకాల పాత్రల్లో  ప‌ర‌కాయ‌ప్రవేశం చేసి మెప్పించారు. రచయితల కలం నుండి జాలువారిన ఎన్నో అధ్బుతమైన పాత్రలకు ప్రాణం పోసిన మ‌హ‌న‌టుడు శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. ఎన్.టీ.ఆర్,  ఏ.ఎన్.ఆర్, ఎస్.వీ.ఆర్,  కృష్ణ, శోభన్ బాబు లాంటి గొప్ప నటులతో ఆయన తెరను పంచుకున్నారు. ఆయ‌న‌ 1000 కి పైగా చిత్రాల్లో న‌టించి సినిమా పై త‌న ప్రేమ‌ని చాటుకున్న క‌ళామాత‌ల్లి ముద్దుబిడ్డ అల్లు రామ‌లింగ‌య్య గారు. ఎక్కువ చిత్రాల్లో న‌టించి సినీ జగత్తులో చాలా మంది న‌టిన‌టుల‌కి మార్గదర్శకుడయ్యారు. న‌ట‌న‌కి నిలువెత్తు రూపం శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. తెలుగు సినిమా చరిత్ర లో ఉన్న గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామ‌లింగ‌య్య గారి పాత్రలు ఉండ‌టం విశేషం. హోమియోపతి డాక్ట‌ర్ గా కూడా ఆయన తన సేవలను అందించారు. న‌టుడిగా ఎంత బిజీగా ఉన్నా ఆయన త‌న హోమియోప‌తి వృత్తి ని మాత్రం వ‌ద‌ల్లేదు. వీలున్నప్పుడ‌ల్లా సినిమా న‌టుల‌కి కూడా త‌న వైద్యాన్ని అందించారు.
అల్లు రామలింగయ్య గారు 1922 ఆక్టోబర్ 1న, అప్పటి మద్రాస్ ప్రావిన్స్ లోని, పాలకొల్లు గ్రామంలో జన్మించారు. ‘క్విట్ ఇండియా’ మూవ్మెంట్ లో పాల్గొని అరెస్ట్ అయిన స్వాతంత్ర సమారా యోధుడు. నాటకాల పట్ల ఉన్న మక్కువతో ‘ప్రజా నాట్య మండలి’ ద్వారా రంగస్థల నటుడిగా ఆయన తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. నృత్య కాళా మండలి వారిచే “హాస్య కళా ప్రపూర్ణ”  బిరుదుతో సత్కరించబడ్డారు. 1953వ సంవత్సరంలో వచ్చిన పుట్టిల్లు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తర్వాత వరసగా  వచ్చిన  వద్దంటే డబ్బు,  దొంగ రాముడు, మిస్సమ్మ, చిత్రాల్లో  నటించారు. కె.వీ.రెడి గారు సృష్టించిన కళాకండం “మాయాబజార్” చిత్రంలో కూడా ఆయన నటించారు. హాస్య పాత్రలె కాకుండా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో  నటించిన ఆయన ఎన్నో అవార్డ్లను  సొంతం చేసుకున్నారు. నటుడిగానే కాకుండా హొమియోపతి వైద్యుడిగా కూడా ఆయన సుప్రసిద్దుడు. హొమియోపతి వైద్యుడిగా ఆయన పలు సేవాకార్యక్రమాలు కూడా నిర్వహించిన గొప్ప మనిషి. ఇంకెందరో నటులకి మార్గం చూపించిన మార్గాదర్శి. కళా రంగంలో ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ను “పద్మశ్రీ” తో సత్కరించింది. అంతటి గొప్ప వ్యక్తి నేడు మన మధ్య లేకపోవటం మన దురదృష్టం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.