
కరోణ వల్ల అన్ని పనులు, లావాదేవీలు ఆగిపోయాయి, ఆర్థిక రంగం దెబ్బతింది, ఇప్పుడిప్పుడే జనాలు బయటికి వచ్చి తమ తమ పనులు చక్కబెట్టుకున్తున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే. కుండపోత వర్షాలు, అతి భారీ వర్షాలు అనేలా కాకుండా అంతకు మించి అనేలా వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నగరవాసులు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆదుకునేందుకు ముందుకు వచ్చే టాలీవుడ్ సినీ తారలు మరోసారి వారి ఉదారతను చాటుకుంటున్నారు
హైదరాబాద్‌కు అండగా నిలబడేందుకు టాలీవుడ్ కదిలింది. మొదటి అడుగు బాలయ్య దే.
హైదరాబాద్ వరద బాధితులకు కోటిన్నర రూపాయలను బాలయ్య విరాళంగా ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళం అందించిన తొలి హీరో బాలయ్యే కావడం గమనార్హం. ఇక బాలయ్య ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన హీరోలందరూ ముందుకు వచ్చారు. వరుసగా విరాళాలు ప్రకటిస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం ముందుకు రావడం, వెంటనే నిధులు సమకూర్చడాన్ని అభినందించారు. తమ వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నామని చిరంజీవి, మహేష్ బాబు తెలిపారు
హైదరాబాద్ వరద బాధితుల కోసం నాగార్జున యాభై లక్షలు, జూ ఎన్టీఆర్ యాభై లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు.. దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారిని కాపాడేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వ కృషిని అభినందిస్తున్నాం మా వంతు సాయంగా ఈ విరాళాలాన్ని ఇస్తున్నామని ప్రకటించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను
సి.ఎమ్ సహాయనిధికి అందచేసారు. మనం కేరళకు అండగా నిలబడ్డాం, చెన్నైకీ భరోసా ఇచ్చాం, సైన్యానికి తోడుగా ఉన్నాం కరోనా సమయంలోనూ అందరం కలిసి పని చేశాం కానీ ఈ సారి మన సిటీ కోసం, మన వారి కోసం చేతులు కలుపుదాం నేను నా వంతుగా పది లక్షలను సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నాను అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.
ఇక హీరోలతో పాటు దర్శకులు కూడా వారికి తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు.
టాలీవుడ్ లో అగ్ర హీరోలు యువ హీరోలు చాలా మంది తెలంగాణ సీఎం సహాయనిధిగా వారి వంతు సహయాన్ని అందిస్తున్న సమయంలో దర్శకులు త్రివిక్రమ్ తో పాటు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి అలాగే మరికొందరు వరద బాధితుల కోసం విరాళాలను అంధించారు. ప్రస్తుతం వారి మంచితనానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నగరం నా కళ్ళ ముందు బాధపడుతోంది దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. భారీ వర్షాల కారణంగా నేను నివసిస్తున్న నగరం నా
కళ్ళ ముందు బాధపడుతోంది. మా హైదరాబాద్‌ను తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ రిలీఫ్ వర్కర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారికి అండగా ఉండేందుకు నా వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను తెలంగాణ సీఎంఓకి అందిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను... గబ్బర్
సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఈ విధంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌కు జరిగిన నష్టాన్ని మనం తిప్పికొట్టలేమని ఖచ్చితంగా అనుకుంటున్నాను, కాని నేను కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను. అందుకు కాస్త సంతోషంగా ఉంది. హైదరాబాద్ వరదల వల్ల బాధపడుతున్న ప్రజల కోసం నా వంతు సహాయంగా 5లక్షల రూపాయలు.. అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వంతు సహాయంగా ప్రొడక్షన్ హౌజ్ సీతారా
ఎంటర్టైన్మెంట్ తో కలిసి 10లక్షల విరాళం అంధించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ రూ.కోటి 50లక్షలు ప్రకటించగా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఇద్దరు చెరో కోటి రూపాయల విరాళం అందించారు. ఇక నాగార్జున, జూనియర్ వారి తరపున చెరో 50లక్షల రూపాయలని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. విజయ్ దేవరకొండ కూడా 10లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. వీరితో పాటు మరికొందరు వరద బాధితుల నిమిత్తం సి.ఎమ్ సహాయనిధికి తమ
వంతు సాయంగా విరాళాలని అందజేస్తున్నారు.