
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ వారం సరికొత్త టాస్క్ లతో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగిపోతోంది. సోమవారం నామినేషన్స్ జరగ్గా, నిన్నటి నుండి కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. బిగ్ బాస్ ఈసారి డీల్ ఆర్ నో డీల్ టాస్క్ అంటూ టీమ్ ను రెండు గ్రూపులుగా వేరు చేసిన విషయం తెలిసిందే. అఖిల్ టీమ్ అండ్ అరియనా టీమ్ ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్నారు. మొదటి రోజు కుమార్ సాయి, రెండు టాస్క్ లలో డీల్స్ సెట్ చేసుకున్నాడు, హారిక జుట్టు కత్తిరించుకుంది. లాస్య వేరే ఐటమ్స్ తో చేసిన జ్యూస్ తాగింది. మోనాల్ జ్యుట్ తో నేసిన డ్రెస్ వేసుకుంది. ఇక రెండో రోజు మరింత కఠినమైన టాస్క్ లను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఇంతకీ ఈ టాస్క్ లో ఏ టీమ్ నెగ్గుతుందో తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.