
మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన,అక్కినేని ఫ్యామిలీ కోడలు సమంత ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల... 'యుఆర్ లైఫ్ డాట్ కాం' ని ప్రారంభించి ఇందులో లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఎన్నో విషయాల్ని వెల్లడిస్తున్నారు. సామాన్య జనాలకు అర్థమయ్యే రీతిలో ఎంతో మంచి కార్యక్రమాల్ని డిజైన్ చేసి లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు.
తాజాగా ఒక వంట కార్యక్రమానికీ సమంత తో కలిసి ఉపాసన హోస్టింగ్ చేసింది.
బ్రౌన్ రైస్ తో "సక్కాలి కదం" అనే వంటకాన్ని తయారు చేయడం ఎలా? అనే అంశంపై చేసిన సమంత వీడియోకి
ఉపాసన ప్రశ్నలు ప్రోగ్రామ్ ని రక్తి కట్టించాయి.
వంట చాలా బావుంది నాగచైతన్య చాలా అదృష్టవంతుడు. అంటూ ఉపాసన కాంప్లిమెంట్ ఇవ్వడమే గాక ఉత్తమ కోడలు
అవార్డు ను కూడా సమంత కి ఇచ్చింది ఉపాసన. ఇక ఫిట్ నెస్ కి, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు ఈ వెబ్ సైట్ లో
మనకి అందుబాటులో ఉంచనున్నారు.
సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ ల నుండి వచ్చిన ఈ కోడళ్ళు రన్ చేస్తున్న ఈ వెబ్ సైట్ ఇప్పటికే ప్రజాధరణ పొందింది . ఆల్ ది బెస్ట్ సామ్ అండ్ ఉపాసన.