
'మెగాస్టార్' చిరంజీవి మేనల్లుడు 'సుప్రీం హీరో'
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "ఉప్పెన"
క్రితి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయికరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.అయితే ఈ రోజు (సెప్టెంబర్ 21 ) క్రితి శెట్టి పుట్టినరోజు
ఆమె పుట్టినరోజు సందర్భంగా "ఉప్పెన" టీం క్రితి శెట్టి ఫోటోతో ఒక పోస్టర్ ని విడుదల చేసి ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
ఆ పోస్టర్ లో క్రితి చాలా క్యూట్ గా ఉందని ఆమెకి మంచి లైఫ్ ఉందని నెటిజన్లు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
"ఉప్పెన" చిత్రం మంచి విజయం సాధించి వైష్ణవ్ తేజ్ కి,
క్రితి శెట్టి కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ
క్రితి శెట్టి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీడియా9 టాలీవుడ్.