
కంగనా రనౌత్ పై ఎవరు విమర్శలు చేసినా వెంటనే వారిపై విరుచుకుపడుతూ ఉంటుంది.
తనను విమర్శించిన వాళ్ళ స్టేటస్ తో గాని వాళ్ళకున్న పేరుతో గాని సంబంధం లేకుండా తను కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటుంది.
ఇటీవల...
బాలీవుడ్ లో 90 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారు అంటూ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై జయా బచ్చన్ స్పందించి ఆ వ్యాఖ్యలను ఖండించారు.
జయా బచ్చన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఊర్మిళ, కంగనా మాటల తీరును విమర్శించింది.
బిజెపి వాళ్ళ మద్దతు కోసం ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తపరిచింది. అంతేకాకుండా... కంగనా ఏదైనా బిజెపి స్థానాన్ని ఆశిస్తుందా? అని ప్రశ్నించింది.
అయితే ఈ వ్యాఖ్యలను కంగనా చాలా సీరియస్ గా తీసుకుంది.
ఒక ఇంటర్వ్యూలో కంగనా ఊర్మిలా తన పైన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ... ఒక పోర్న్ స్టారే టికెట్ సాధించగలిగింది.
అలాంటిది మరాఠా గొప్పతనం చాటిచెప్పిన నాలాంటి నటి ఒక సీటు సంపాదించడం ఏమాత్రం కష్టమైన పని కాదు. అని ఊర్మిలా కి గట్టి కౌంటర్ ఇచ్చింది కంగనా.
ఇప్పుడు కంగనా విసిరిన బంతిని సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పట్టుకున్నాడు.
నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఊర్మిళ ని, కంగనా ఇలాంటి మాటలు అనడం సరికాదు, ఇలాంటివి మళ్లీ నేను వినకూడదని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు ఆర్జీవి.
మరి వర్మ కౌంటర్ పై కంగనా ఏలాంటి కౌంటర్ తో విరుచుకు పడుతుందో చూడాల్సిందే.