
మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమా షూటింగ్ ప్రారంభించాడు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో లాంచ్ అయిన ఈ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఈ హీరో నటించిన మొదటి సినిమా ఉప్పెన విడుదల వాయిదా పడింది.
ఇంకో పక్క క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఒక పీరియాడిక్ సినిమా తెరకెక్కస్తున్నాడు. పవర్ స్టార్ ఆ సినిమాకి బ్రేక్ తీసుకుని వేరే షూటింగ్ లో ఉండగా ఈ గ్యాప్ ని క్రిష్ ఇంకో సినిమా కోసం వాడుకుంటున్నాడు. మొత్తానికి ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు డైరెక్టర్ క్రిష్..
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సాయిబాబు జగర్లాముడి మరియు రాజీవ్ రెడ్డి చేత నిర్మించబడుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు.. రకుల్ ప్రీత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.