
కరోనా వచ్చి లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల పరిశ్రమలు ఇబ్బంది పడ్డాయి. ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా చాలా మంది ఇబ్బందిపడుతున్నారు కూడా. అదే రకంగా అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది పడిన వాటిలో సినిమా ఇండస్ట్రీ ఒకటి. షూటింగ్స్ లేక సినీ కార్మికులు, థియేటర్స్ ని నమ్ముకున్న వాళ్లు, ఇంకా ఇండస్ర్టీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా కానీ ముందు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే.
గతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా మంది సెలెబ్రిటీలు చెప్పగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మళ్ళీ కరోనా జాగ్రత్తలు గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.. ఆయన ట్వీట్ లో ఈ విధంగా చెప్పారు..
"ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక అభ్యర్థన - దయచేసి మాస్కులు ధరించడం కొనసాగించండి, చేతులు కడుక్కోండి మరియు క్రమం తప్పకుండా తమ తమ పరిసరాలను శుభ్రపరచండి / సానిటైజ్ చేయండి
దయచేసి సామాజిక దూరాన్ని కొనసాగించండి! వైరస్ ఇప్పటికీ మన మధ్య ఉంది మరియు చాలా ప్రమాదకరంగా ఉంది! అందరినీ హెచ్చరించండి. మీ భద్రతను మరింత తీవ్రంగా పరిగణించండి"
లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా కానీ వైరస్ తీవ్రత మాత్రం తగ్గలేదు. కాబట్టి ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం వెంకీ మామ చెప్పినట్లు.