
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న
'స్టైలిష్ డైరెక్టర్' సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రూపు దిద్దుకోబోతుంది. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు. నేడు కేదార్ సెలగం శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'ఫైటర్' అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్.
ఈ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ, సుకుమార్ ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ట్వీట్ చేస్తూ...నాలో ఉన్న నటుడు చాలా ఎగ్జయిట్ గా ఎదురు చూస్తున్నాడు.
నాలోని ప్రేక్షకుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాను అందిస్తామని గ్యారంటీ ఇస్తున్నాను. సుక్కు సార్ తో సెట్స్ లో ఎప్పుడెప్పుడు కలిసి వర్క్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాను.
హ్యాపీ బర్త్ డే కేదార్. నువ్వు నాకు మంచి స్నేహితుడివి. ఎంతో హార్డ్ వర్క్ చేస్తావు అని ట్వీట్ చేశాడు.
వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రారంభిస్తారని తెలుస్తుంది.