క్రికెట్ ఆడబోతున్న ‘విజయ్ సేతుపతి’

తన నటనతో కేవలం తమిళంలోనే కాకుండా దక్షిణాది మొత్తంలో ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు కొలీవుడ్ విలక్షణ నటుడు ‘విజయ్ సేతుపతి’. తమిళంలో కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించిన విజయ్, యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘పిజ్జా’ చిత్రంతో తెలుగులో కూడా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిండంతో పాటు తనదైన శైలి నటనతో ప్రేక్షకులనూ మెప్పించారు విజయ్ సేతుపతి. విక్రమ్ వేదా, నవాబ్, పేట్టా, సూదు-కవ్వం లాంటి చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన వరసగా తమిళ చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. ఆయన ముఖ్యపాత్రలో నటించిన మాస్టర్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

కాగా ఆయన త్వరలో ప్రముఖ శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథగా తెరకెక్కనున్న చిత్రంలో నటించబోతున్నారు. ఈ విషయం అధికారికంగా ప్రకటితమైంది. టెస్ట్ మ్యాచ్లలో 800 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ ముత్తయ్య పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ “ అరుదైన చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది నా కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది. మిగితా వివరాలు త్వరలో వెల్లడిస్తాము” అని ఆయన అన్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.