విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు.

విలక్షణ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూసారు.ఎన్నో తెలుగు సినిమాల్లో మరిచిపోలేని పాత్రలకు తనదైన రాయలసీమ మాండలికంతో ప్రాణం పోసారనే చెప్పలి.
కరడుగట్టిన విలనిజాన్ని, కడుపుబ్బా నవ్వించే హాస్యాన్నీ పండిస్తూ వందల సినిమాల్లో తన ప్రస్థానాన్ని కొనసాగించారు.
మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బాత్రూమ్ లోనే కుప్పకూలి పడిపోయారు.
కరోనా కారణంగా షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో కొంతకాలంగా ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.
ఇలాంటి విలక్షణమైన నటున్ని కోల్పోవడం నిజంగా సినిమా రంగానికి తీరని లోటనే చెప్పాలి.తను పోషించాల్సిన పాత్రలు ఎన్నో ఆయన కోసం వేచి చూస్తూనే ఉన్నాయి.ఈ లోపే శాశ్వతంగా తన పాత్ర ఇలా మధ్యలో ముగియడం విచారకరం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.