
లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ పనులు మళ్ళీ మొదలు కానున్నాయి. నవంబర్ ఒకటవ తేదీ నుండి పదిహేను రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేయనున్నారు. ఈ షేడ్యూల్ అంతా వికారబాద్ ఫారెస్ట్ లో జరగనుంది. ఫారెస్ట్ లో జరిగే కీలక సన్నివేశాలు రానా, సాయి పల్లవి, ప్రియమణి ఇతర ప్రధాన తారగణం పై చిత్రీకరించనున్నారు. మరో ముఖ్యపాత్రలో నటి నందితశ్వేత నటించనున్నారు. నందితశ్వేత కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రికరణ పూర్తి చేశారు. ప్రియమణి పోషిస్తున్న ‘కామ్రేడ్ భారతక్క’ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని చిత్ర బృందం పేర్కొంది.సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో చేస్తున్న ‘లవ్ స్టోరి’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం తర్వాత నవంబర్ లో ‘విరాటపర్వం’ షూటింగ్ లో పాల్గొననున్నారు. నవీన్ చంద్ర, జరీనా వహబ్, రాహుల్ రామకృష్ణ, ఈశ్వరీ రావు, సాయిచంద్
తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.