
స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి పుట్టినరోజు నేడు.
బన్నీ కెరీర్ కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో పర్సనల్ లైఫ్ కి కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తాడు. ఫ్యామిలీ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీ తో,తన పిల్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు.
మంగళవారం స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి నుండే పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. అల్లు అర్జున్ తన స్నేహితులకు, బంధువులకు చిన్నపాటి విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా స్నేహ రెడ్డి కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయ. అల్లు అర్జున్ కూడా కేక్ కటింగ్ ఫోటోని పోస్ట్ చేసి...'నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తికి ఈ రోజు పుట్టినరోజు, నీతో ఎక్కువ పుట్టినరోజులు గడపాలని కోరుకుంటున్నాను. అని తన సతీమణి కి ప్రేమ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు మన స్టైలిష్ స్టార్.