ఆర్.ఆర్.ఆర్ సినిమాని అడ్డుకుంటాం

2019 ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రారంభిస్తునప్పుడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఆ చిత్ర జోనర్  హిస్టారికల్ ఫిక్షన్ అని తెలియపరిచారు. హిస్టారికల్ ఫిక్షన్ అంటే చరిత్రలో ఉన్న నిజమైన పాత్రలను తీసుకుని వారి చుట్టూ అల్లుకున్న కథను తెరకెక్కించడం. ఈ కథలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలని తీసుకొని వారి చుట్టూ జరిగిన కథను తీస్తున్నాం అని రాజమౌళి చెప్పారు. అప్పుడు ఎవరూ ఈ విషయం గురించి అడ్డు చెప్పలేదు. తమ నాయకుడు భీమ్ గురించి దేశానికి అంత తెలుస్తుంది అని గిరిజనులు సంతోషపడ్డారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియ మూవీగా రోజు రోజుకి అంచనాలు పెరుగుతుంటే దానితో పాటు వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇది నిజమైన కథ కాదు అని ఆర్.ఆర్.ఆర్ టీం, రాజమౌళి ఎన్ని సార్లు చెప్పిన కూడా అభ్యంతరాలు ఆగటంలేదు. ఈ మధ్య విడుదల అయిన ఆర్.ఆర్.ఆర్ భీమ్ టీజర్ తో ఈ వివాదాలు చెలరేగాయి. కాగా ఇప్పడు కొమురం భిమ్ మనవడు సోన్ రావ్ ఆర్.ఆర్.ఆర్ లో సీన్స్ కొన్ని తీసేయాలని ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోలో సోన్ రావ్ మాట్లాడుతూ “భీమ్ గిరిజనుల భూమి, నీరు, ఇతర వనరుల కోసం పోరాటం చేసిన వీరుడు. మా హీరో గురించి పూర్తి సమాచారం కోసం దర్శకుడు, రచయితలు మమ్మల్ని సంప్రదించినట్లయితే, మేము వారికి సహాయం చేసేవాళ్ళం. అయితే అలాంటి వ్యక్తిని మైనారిటీ వర్గ సభ్యునిగా చూపించడం చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. ఈ సినిమాలో ఒక దేవుడిగా ఆరాధించే హీరోని తప్పుగా చూపించడం ఆదివాసులను బాధపెట్టడమే అవుతుంది. ముస్లిం గెటప్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము రాజమౌళిని అభ్యర్థిస్తున్నాము” అని ఆ వీడియోలో సోన్ రావ్ వివరణ ఇచ్చారు. కానీ దీని గురించి రాజమౌళి గాని ఆర్.ఆర్.ఆర్ టీమ్ కాని ఇంకా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.