
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు 100కు పైగా సినిమాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో అధిక భాగం సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడం విశేషం. అయితే గత కోనేళ్ళుగా రాఘవేంద్రరావు గారు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ట్విట్టర్ లో రాఘవేంద్రరావు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేసారు. అక్టోబర్ 9న ఉదయం 11:30 నిమిషాలకు, బందుమిత్రుల సమక్షంలో తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఉంటుందని తెలియజేసారు. మాకు అందిన సమాచారం ప్రకారం రాఘవేంద్రరావు ఒక సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రాన్ని ఈయన నిర్మించనున్నారు. గౌరీ అనే నూతన దర్శకురాలు ఈ చిత్రాకి దర్శకత్వం వహించనున్నారు. రేపు రాబోయే అప్డేట్ లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది. రోషన్ 2016లో నిర్మలా కాన్వెంట్ తో హీరోగా పరిచయమైన విషయం తెల్సిందే. మరి ఈ చిత్రంతో రాఘవేంద్రరావు ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తారో వేచి చూడాలి.
Stay tuned.. pic.twitter.com/16uMDrNHbf
— Raghavendra Rao K (@Ragavendraraoba) October 7, 2020