
రాక్ స్టార్ యష్ గారాలపట్టి ఐరా చిలిపి వేషాలతో ఆయన్ను ఆటపట్టించింది. ఐస్ క్రీమ్ అంటూ డాడీ నోటికి అందించినట్టే అందించి గుటుక్కున మింగేసి యష్ ను కాసేపు సరదాగా ఏడిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. యష్ ఇటీవల తన కూతురు ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసారు. ఐరా వాళ్ళ నాన్న దగ్గర వేసే చిలిపి వేషాలు అందరికీ చిరునవ్వు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం యష్
ఇండియా వైడ్ గా ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా కీర్తి గడించారు. తన ట్రెమెండస్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కే.జి.ఎఫ్ ద్వారా తన మార్కెట్ ని అమాంతం ఎన్నో రేట్లు పెంచుకుని మంచి స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా హీరోలు తమ కుటుంబాలకు చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. వారి టెన్షన్స్ కి రిలాక్సేషన్ కుటుంబమే. అలా యష్ కూడా తన కుటుంబంతో చాలా సమయం కేటాయిస్తారు.
టాలీవుడ్ విషయానికొస్తే మహేష్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ కూతురు అర్హ లు ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఊంటారు. అలా ఇప్పుడు యష్ కూతురు ఐరా కూడా తన చిలిపి వేషాలతో నెటిజన్ల మనసు దోచేస్తోంది. యష్, రాధిక ల జంటకు 2018 డిసెంబర్ 2 న ఐరా జన్మించిగా, 2019 అక్టోబర్ 30న వారు తమ రెండవ బిడ్డ కు జన్మనిచ్చారు.
https://www.instagram.com/p/CGw5DmtHXq9/?utm_source=ig_web_copy_link